News February 21, 2025
అరకు: సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలి

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విట్టర్), ఇతర సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని అరకు CI హిమగిరి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యక్తుల, సంస్థలపై అసత్య ప్రచారాలు, అవమానకరమైన ఫొటోలు, వీడియోలు పెడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
Similar News
News September 19, 2025
ఒక్క రోజులోనే ఎంప్లాయ్మెంట్ కార్డు: సాహితీ

యువతకు ఎంప్లాయిమెంట్ కార్యాలయం జారీ చేసే ఎంప్లాయిమెంట్ కార్డు తప్పనిసరని జిల్లా ఉపాధి అధికారిణి సాహితీ తెలిపారు. గతంలో కార్డు మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఒక్కసారి కార్డు తీసుకుంటే ఇక శాశ్వతంగా ఉంటుందన్నారు. మీసేవ కేంద్రాలు, ఫోన్ నుంచి employment.telangana.gov.inలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే కార్డు జారీ చేస్తామని వెల్లడించారు.
News September 19, 2025
అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక విజయం

ఆసియా కప్: అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 169-8 రన్స్ చేసింది. AFG బ్యాటర్లలో నబి(60), SL బౌలర్లలో తుషారా 4 వికెట్లతో రాణించారు. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(74) చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. AFG బౌలర్లలో ముజీబ్, అజ్మతుల్లా, నబి, నూర్ తలో వికెట్ తీశారు. లంక సూపర్ 4కు క్వాలిఫై అవ్వగా.. AFG టోర్నీ నుంచి ఎలిమినేటైంది.
News September 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.