News December 30, 2025
అరటి గెలల నాణ్యత పెరగాలంటే?

అరటిలో పండు పరిమాణం, నాణ్యత పెంచేందుకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజు మరియు 15వ రోజున లీటరు నీటికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములను కలిపి గెలలపై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగాలి. దీని వల్ల అరటిపండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లను పొందవచ్చు. ఇవి ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.
Similar News
News February 19, 2026
నెలసరికి ముందు ఇవి మేలు..

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటి వల్ల ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు తగ్గించడానికి డైట్‌లో డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు.
News February 19, 2026
వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్స్

TG: ఇంటర్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపినట్లు బోర్డు వెల్లడించారు. tgbie.cgg.gov.in సైట్ సర్వర్లు బిజీగా ఉంటే ప్రత్యామ్నాయంగా WhatsApp లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సాంకేతిక సమస్యలుంటే కాలేజీ ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న QR Code స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.
News February 19, 2026
5,349 పోస్టులకు నోటిఫికేషన్

<


