News January 14, 2026

అరటి పంట పెరుగుదల, పండు నాణ్యత కోసం..

image

అరటి మొక్కకు కొద్దిపాటి రసాయన ఎరువులతో పాటు ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులను వేయడం వల్ల మొక్క ఎదుగుదలతో పాటు పండు నాణ్యత పెరుగుతుంది. 300 గ్రాముల భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 5 కేజీల బాగా చివికిన పశువుల ఎరువుతో కలిపి మొక్కలకు అందించాలి. 45 సెం.మీ పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీసి అందులో ఈ ఎరువును వెయ్యాలి. భాస్వరం ఎరువులు పంట మొదటి దశలోనే అవసరం. తర్వాతి దశలో అవసరం ఉండదు.

Similar News

News February 22, 2026

BREAKING: లొంగిపోయిన దేవ్‌జీ

image

ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి <<19197693>>సరెండర్<<>> అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ SIB ముందు లొంగిపోయారు. మార్చి 31నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్‌జీ, రాజిరెడ్డి టార్గెట్‌గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

News February 22, 2026

సెంట్రల్ ఎలక్ట్రో‌కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 4 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BTech/MTech(కెమికల్ ఇంజినీరింగ్), PhD(ఫిజికల్/కెమికల్ సైన్సెస్), BSc(కెమిస్ట్రీ) అర్హతగల వారు మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు. మార్చి 6న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. సైట్: www.cecri.res.in/

News February 22, 2026

తడి బట్టలతో పూజ చేయవచ్చా?

image

దైవకార్యాల్లో తడి బట్టలు ధరించకూడదు. అలా చేస్తే పితృదేవతలు ఆగ్రహానికి గురవుతారని నమ్మకం. ‘తడి బట్టల నుంచి కారే నీరు పితరులకు వెళ్తుందని, తద్వారా వారు అసంతృప్తి చెందితే సంతాన, సంపద లోపం కలుగుతుందని శాస్త్రం హెచ్చరిస్తోంది. తడి బట్టలతో ఆలయ ప్రవేశం, పూజ చేయడం మహా పాపం. అపర కార్యాలకు మాత్రమే తడి బట్టలు నిషిద్ధం కాదు. కాబట్టి ఎప్పుడూ పొడి బట్టలతోనే పూజలు నిర్వహించాలి’ అని పండితులు చెబుతున్నారు.