News September 3, 2025

అరసవిల్లి సూర్య దేవాలయం మూసివేత

image

అరసవిల్లి ఆదిత్య ఆలయాన్ని ఈ నెల 7న భాద్రపద పౌర్ణమి చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. మరుసటి రోజు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు.

Similar News

News September 5, 2025

శ్రీకాకుళం జిల్లాలో పలువురికి ఉద్యోగోన్నతి

image

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఏఓలు, ఈఓపీఆర్డీలకు ఎంపీడీఓలుగా ఉద్యోగోన్నతి పొందారు. ఎస్.వాసుదేవరావు(ఆమదాలవలస), హెచ్.వి.రమణమూర్తి(కంచిలి), చిన్నమ్మడు(సారవకోట), టీ.రాజారావు(నందిగం), జె.ఆనందరావు(కోటబొమ్మాళి), ఎం.రేణుక(నరసన్నపేట), వసంతకుమారి(కొత్తూరు), ప్రభాకర్(ఈఓపీఆర్డీ-సారవకోట)లను ఉద్యోగోన్నతి కల్పిస్తూ గురువారం పంచాయతీరాజ్ కమీషనర్ ఉత్తర్వులు జారీచేశారు.

News September 5, 2025

SKLM: NMMS పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు NMMS పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని DEO ఏ.రవిబాబు (ఇన్‌ఛార్జి ) తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 4 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.5 లక్షలలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News September 5, 2025

శ్రీకాకుళం జిల్లాకు సరిపడ యూరియా నిల్వలు

image

శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సాగుకు కావలసిన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 4.07 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని, రైతుసేవా కేంద్రాలు, సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా కలిపి 24,421 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించామన్నారు. కోరోమండెల్ కంపెనీ నుంచి మరో 900 మెట్రిక్ టన్నులు రానున్నాయన్నారు.