News March 30, 2025

‘అరుకు ఎంపీని ఆహ్వనించకపోవడం ఆమెను అవమానించమే’

image

అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్లో ఏర్పాటు చేసిన సందర్భంలో అరకు ఎంపీ తనూజరాణిని ఆహ్వానించకపోవడం ఆమెను అవమానించడమే అని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు అన్నారు. పార్వతీపురంలో శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోనే ఎన్డీఏ కూటమి ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని, ప్రతి చోటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని మండిపడ్డారు.

Similar News

News July 6, 2025

ఆంధ్ర మూలాలున్న పత్రికలను మేమెందుకు చదవాలి?: RSP

image

‘తెలంగాణ BRS జాగీరా?’ అంటూ వచ్చిన ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ‘తెలంగాణ జ్యోతి’గా పేరు మార్చుకోకుండా సర్కులేట్ అవుతోందని మండిపడ్డారు. విశాలాంధ్ర మన తెలంగాణగా, ప్రజాశక్తి నవ తెలంగాణగా పేరు మార్చుకున్నాయని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల తొత్తులకు వెన్నంటి నిలిచే ఆంధ్రమూలాలున్న పత్రిక/ఛానళ్లను TG ప్రజలు ఎందుకు చదవాలని ప్రశ్నించారు.

News July 6, 2025

ఈనెల 10 లోపు శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత

image

ఈనెల 10 తేదీలోపు శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. రేపటి నుంచి డ్యాం ఇంజినీరింగ్ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏ క్షణంలో అయినా డ్యామ్ గేట్లను తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News July 6, 2025

SKLM: వ్యాధులు పట్ల అప్రమత్తం అవసరం

image

పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు పట్ల అప్రమత్తతో మెలగాలని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజగోపాలరావు అన్నారు. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని శ్రీకాకుళం వెటర్నరీ పోలీ క్లినిక్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల నుంచి ర్యాబిస్, స్వైన్ ఫ్లూ, యంత్రాక్స్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నారు.