News February 9, 2025
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్: డిపో మేనేజర్

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ నడుపుతున్నట్లు RTC WGL-1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు. ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బయలు దేరుతుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.4500, పిల్లలకు రూ.3వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 9959226047, 9494107944 నెంబర్‌లో సంప్రదించాన్నారు.
Similar News
News November 4, 2025
వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయిలో కోడె మొక్కులు

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రికార్డ్ స్థాయిలో భక్తులు కోడె మొక్కులు సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో స్వామివారి అన్ని రకాల ఆర్జిత సేవలను రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నుంచి భీమేశ్వర స్వామి వారి ఆలయానికి మార్చిన కారణంగా భక్తుల రద్దీ తగ్గుతుందనే అంచనాలకు భిన్నంగా సోమవారం సుమారు 5000 మంది భక్తులు కోడె మొక్కుబడి చెల్లించుకున్నారు.
News November 4, 2025
విజయనగరంలోనూ భూప్రకంపనలు?

విశాఖ, అల్లూరి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున పలు చోట్ల భూమి కంపించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో <<18192060>>భూకంపం<<>> నమోదైనట్ల మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తన వెబ్‌సైట్‌లో మంగళవారం పొందుపరిచింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 పాయింట్ల తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. విజయనగరంలోనూ పలుచోట్ల భూమి కంపించినట్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు.
News November 4, 2025
సిరిసిల్ల: ‘పోషిస్తానని చెప్పి.. వెళ్లగొడుతున్నాడు’

రాజరాజేశ్వర జలాశయ ముంపు బాధితులైన కడుగుల రుక్కమ్మ–మల్లయ్య దంపతులు సోమవారం సిరిసిల్ల ప్రజావాణిలో ఇన్ఛార్జి కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు. పరిహారంగా వచ్చిన రూ. 7.50 లక్షలను తమ సొంత చెల్లెలి కొడుకు తీసుకున్నాడని, పోషిస్తానని చెప్పి ఇప్పుడు ఇంటి నుంచే వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమకు న్యాయం చేయాలని, తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని వారు వేడుకున్నారు.


