News January 31, 2025
అరుదైన అనుభూతి: చదివిన పాఠశాలలోనే రిటైర్

తాను చదివిన పాఠశాలలోనే పని చేస్తూ రిటైర్ అయ్యే అవకాశం రావడం అరుదైన విషయం. అలాంటి అవకాశం అల్లూరి జిల్లా రాజవొమ్మంగి జడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన కె.వరలక్ష్మికి వచ్చింది. ఆమె చదువుకున్న స్కూల్‌లోనే శుక్రవారం పదవీ విరమణ చేసింది. పదో తరగతి వరకు తాను ఇదే పాఠశాలలో చదువుకున్నట్లు వెల్లడించింది. పలు గ్రామాల్లో పని చేసి చివరకు తాను చదివిన పాఠశాలలోనే రిటైర్ అవ్వడం ఆనందం ఉందన్నారు.
Similar News
News September 17, 2025
విహారయాత్రకు బయలుదేరిన జీవీఎంసీ కార్పొరేటర్లు

జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్‌పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.
News September 17, 2025
సోషల్ మీడియా పోస్టుకి స్పందించిన DyCM పవన్ కళ్యాణ్

ట్విట్టర్(X)లో ఒక సామాన్యుడు పెట్టిన పోస్టుకు DyCM పవన్ కళ్యాణ్ స్పందించారు. గుంతలమయంగా మారిన ఏలేశ్వరం – అడ్డతీగల రోడ్డు దుస్థితిపై చైతన్య రాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ ఈ పోస్టుకు స్పందించి, తక్షణ మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులతో రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News September 17, 2025
76వ వసంతంలోకి ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేడు 76వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఓ సాధారణ కుటుంబం నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశానికి ప్రధానిగా ఎదిగారు. గుజరాత్‌కు 13 ఏళ్లు సీఎంగా చేశారు. 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రశంసలతో పాటు విమర్శలనూ ఎదుర్కొన్నారు. ప్రధానిగా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. Happy Birthday PM Narendra Modi.