News February 27, 2026

అరుదైన క్యాన్సర్‌కు చికిత్స చేసిన కేజీహెచ్ వైద్యులు

image

ఐదు గంటల పాటు రోగికి సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు కేజీహెచ్ వైద్యులు. మాడుగుల ప్రాంతానికి చెందిన43 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఆబ్జెక్టివ్ జాండీస్ వ్యాధిగా నిర్ధారణ అయింది. వైద్యులు వెండి తేజేశ్వరరావు పరీక్షలు నిర్వహించి ఐదు గంటల పాటు శ్రమించి సర్జరీ చేశారు. అరుదైన క్యాన్సర్‌గా అధిక మరణాలు కలిగి ఉన్న ఈ వ్యాధి పూర్తిగా తగ్గేలా సర్జరీ చేసి చికిత్స అందించిన వైద్యులకు రోగి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 2, 2026

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష

image

జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు శాంతియుతంగా ముగిశాయని DEO ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. మొత్తం 972 మంది అభ్యర్థులకు గాను 884 మంది హాజరు కాగా, 88 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షల కోసం 6 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు

News March 2, 2026

టీడీఆర్‌ల మంజూరులో అవినీతికి తావివ్వొద్దు: ప్రణవ్

image

వీఎంఆర్డీఏ చేపడుతున్న పనుల్లో అధికారులు నిర్లక్ష్యం ఆలసత్వం చూపించవద్దని కమిషనర్ తేజ్ భరత్ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఆయన కార్యాలయంలో సోమవారం అధికారులతో అభివృద్ధి పనులు, లేఅవుట్లు, రహదారి విస్తరణ పనులపై సమీక్ష చేశారు. విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్‌ల మంజూరులో అవినీతి ఉండకూడదన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు

News March 2, 2026

కలెక్టర్ పీజీఆర్ఎస్‌కు 252 వినతులు

image

విశాఖలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్‌కు 272 మంది ఫిర్యాదులు చేశారని అధికారులు తెలిపారు. ఫిర్యాదులను స్వయంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి బాధితుల నుంచి స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులను పిలిచి కలెక్టర్ అందజేయగా జీవీఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఇతర ఫిర్యాదులపై క్షుణ్ణంగా పరిశీలించారు.