News November 30, 2025

అరుదైన ఫీట్.. 7వేల సెంచరీలు

image

అంతర్జాతీయ క్రికెట్‌లో 7వేల సెంచరీలు నమోదయ్యాయి. ఇవాళ దక్షిణాఫ్రికాతో మ్యాచులో కోహ్లీ చేసిన సెంచరీ 7000th కావడం విశేషం. కాగా తొలి సెంచరీ ఆస్ట్రేలియన్ ప్లేయర్ చార్లెస్ బాన్నర్‌మన్ 1877లో నమోదు చేశారు. 1,000వ శతకం ఇయాన్ చాపెల్(AUS) చేయగా, డీన్ జోన్స్(2,000), స్టీవ్ వా(3,000), కుమార సంగక్కర(4,000), రాస్ టేలర్(5,000), విక్రమశేఖర(6,000) మైల్‌స్టోన్ సెంచరీలు చేశారు.

Similar News

News December 1, 2025

జగిత్యాల: ‘ఈ సంవత్సరం 83 కేసులు నమోదు’

image

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెడికల్ కాలేజీ వరకు నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ ప్రారంభించారు. ఎయిడ్స్‌కు నివారణే మేలని, యువత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో 2,573 మంది ఏఆర్‌టి చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 83 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.

News December 1, 2025

క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

image

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.

News December 1, 2025

ఇకపై అన్ని ఫోన్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయలేం!

image

దేశంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇకపై తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్‌ ‘సంచార్ సాథీ’ని డిఫాల్ట్‌గా ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ యాప్‌ను డిలీట్ చేయలేరు. ఇందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై అటు ప్రభుత్వం, ఇటు మొబైల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు.