News February 24, 2025

అర్జీలను నాణ్యతగా పరిష్కారించండి: సబ్ కలెక్టర్

image

ఆదోని సబ్ కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొని ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్‌ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.

Similar News

News February 24, 2025

కర్నూలు జిల్లా TODAY TOP NEWS

image

➢ మంత్రాలయంలో కన్నడ స్టార్ హీరో
➢ పాణ్యంలో పండ్ల వాహనం బోల్తా.. ఎగబడిన స్థానికులు
➢ శ్రీశైల కాలినడక భక్తుడికి అస్వస్థత.. డోలీలో 5 కి.మీ..
➢ అసెంబ్లీకి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు
➢ కర్నూలు ఎస్పీ సాయం కోరిన ప్రేమ జంట
➢ ఎమ్మిగనూరు టీడీపీ నేత వార్నింగ్
➢ భీముని కొలను వద్ద యువతికి తీవ్ర అస్వస్థత
➢ ఆదోనిలో 30 ఏళ్లుగా డ్రైనేజీ సమస్య
➢ అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి: సబ్ కలెక్టర్

News February 24, 2025

అసెంబ్లీకి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు

image

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హాజరయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలసి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే కొద్దిసేపటికే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు.

News February 24, 2025

కర్నూలులో ఉ.10 గంటల నుంచి అర్జీల స్వీకరణ

image

కర్నూలులో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరగనుంది. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాల్లోనూ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!