News January 12, 2026
అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి పరిష్కారం చూపాలి: JC

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి బాధితులకు పరిష్కారం చూపాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆమె ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 14, 2026
ఒడిశాలో సరికొత్త విప్లవం.. సూపర్ ఫుడ్స్ సాగుతో!

సంప్రదాయ పంటలకే కాకుండా భవిష్యత్తు సూపర్ ఫుడ్స్‌కు నిలయంగా ఒడిశా మారుతోంది. ఖుర్దా జిల్లా బెగునియా ప్రాంతంలో ఒక రైతు 40 లక్షల లీటర్ల సామర్థ్యం గల అతిపెద్ద ‘స్పిరులినా’ ఫామ్‌ను ఏర్పాటు చేశారు. నీలి ఆకుపచ్చ నాచు రకానికి చెందిన ఈ సూపర్ ఫుడ్‌లో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఈ పోషకాహార సాగులో ఒడిశా ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది.
News February 14, 2026
కంకిపాడులో RTC బస్సు ఢీకొని మహిళ స్పాట్‌డెడ్

కంకిపాడు వద్ద జరిగిన ప్రమాదంలో స్థానికంగా ఉంటున్న శైలజా(45) మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కుందేరు నుంచి విజయవాడ వెళ్తున్న RTC బస్సు ప్రమాదవశాత్తు ఆమెను రంగా సర్కిల్ వద్ద ఢీ కొంది. ఈ ఘటనలో ఆమె తలపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె ఆలయానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం ఉయ్యూరు తరలించారు.
News February 14, 2026
రేపు శివాలయానికి వెళ్తున్నారా? ఈ తప్పు చేయకండి!

శివాలయ దర్శనంలో ముఖ్యమైన నియమం శివ నిర్మాల్యాన్ని దాటకపోవడం. పుష్పదంతుడనే గంధర్వుడు నిర్మాల్యాన్ని దాటి తన శక్తిని కోల్పోయాడు. అందుకే శివాలయంలో చండీశ్వరుడి వరకు వెళ్లి వెనక్కి రావాలి. అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. అలాగే దేవుడి వస్తువులను, భక్తులను కించపరచకూడదు. ఇది కూడా నిర్మాల్యాన్ని దాటడంతో సమానం. ఈ తప్పులు మనిషిలోని శక్తిని, తేజస్సును కోల్పోయేలా చేస్తాయని పండితులు చెబుతున్నారు.


