News December 22, 2025
అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజలు అందించిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించి నివేదిక అందజేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 23, 2025
నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి: అదనపు డీసీపీ

శాస్త్ర సాంకేతిక నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్ రైటర్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేసుల పరిశోధనలో నాణ్యతను పెంచి FIR నుంచి అంతిమ రిపోర్ట్ వరకు ఉండవలసిన మెలుకువల గురించి క్షుణ్ణంగా వివరించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్ రావు,టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
News December 23, 2025
996 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

<
News December 23, 2025
కదిరి: గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలపల్లిలో గర్భిణిపై దాడి చేసిన <<18637801>>వైసీపీ<<>> కార్యకర్త అజయ్ దేవ్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున టపాసులు పేల్చుతుండగా వద్దని కోరిన గర్భిణి సంధ్యారాణిపై అజయ్ దాడి చేశాడు. ఆమెను కాలుతో తన్నడంతో అస్వస్థతకు గురయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.


