News March 9, 2026
అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన వికలాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలపై తక్షణమే విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేయాలని ఫోన్ ద్వారా అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన భరోసా కల్పించాలని సూచించారు.
Similar News
News April 14, 2026
సంగారెడ్డి: TGRJC ప్రవేశాలు.. రేపే చివరి తేదీ

తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి బుధవారంతో గడువు ముగియనుందని మునిపల్లి మండలం లింగంపల్లి కళాశాల ప్రిన్సిపల్ చైతన్య తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgrjc.cgg.gov.in ద్వారా రూ. 200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
News April 14, 2026
చిత్తూరు: పుంజుకుంటున్న టమాటా ధరలు

సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న టమాట రైతులకు ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. పలమనేరులో సోమవారం టమాటా బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. నాలుగు రోజుల కిందట బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున ధర పెరుగుతూ వస్తోంది. వేసవి ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుతోంది. మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వస్తున్నాయి.
News April 14, 2026
HYD: అందమైన అమ్మాయిలతో సంపాదన

యువతే వీరి టార్గెట్. అందమైన అమ్మాయిలతో ఆడియో, వీడియో <<19614819>>కాల్స్<<>> అంటూ ఈ యాప్స్ వ్యాపారం చేస్తున్నాయి. వీటి మోజులో పడి యువతి, యువకులు అనేక కేసుల్లో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దోస్త్, కనెక్ట్, ఫ్రెండ్ లాంటి యాప్స్‌పై Gen-S సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. 18- 45 ఏళ్ల మహిళలు ఈ యాప్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని, యువకులు వారితో మాట్లాడటానికి డబ్బు, సమయం వృథా చేసుకుంటున్నట్లు పేర్కొంది.


