News August 21, 2025

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే అర్జీల్లో 85శాతం రెవెన్యూకు సంబంధించినవేనని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి.రంజిత్ బాషా హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం భవనంలో రెవెన్యూ అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే నాలుగైదు సార్లు చెప్పానని, ఇక ఉపేక్షించేది లేదని అన్నారు. జేసీ నవ్య పాల్గొన్నారు.

Similar News

News August 22, 2025

ఈనెల 23న స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రను విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈనెల 23న నిర్వహించే స్వచ్ఛంద్ర-స్వర్ణాంధ్రలో ‘మాన్సూన్ హైజీన్’ థీమ్‌తో నిర్వహించే కార్యక్రమంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డ్వామా, డీపీఓ అధికారులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యంలో మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులకు అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News August 22, 2025

2047 నాటికి ‘ఆనంద ఆంధ్రప్రదేశ్’ను సాధిద్దాం: డీఎంహెచ్ఓ

image

కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో జిల్లా స్థాయిలో 5 సూచికలు, మండల స్థాయిలో 18 అభివృద్ధి సూచికలు ఉన్నాయని, వీటి ప్రగతిని ప్రోగ్రాం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓ డా.శాంతి కళ ఆదేశించారు. శుక్రవారం కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 2047 నాటికి ‘ఆనంద ఆంధ్రప్రదేశ్’ లక్ష్యాలను సాధించేందుకు పనిచేద్దామన్నారు.

News August 22, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు ఎస్పీ కీలక సూచనలు

image

సివిల్, APSP కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈనెల 25, 26వ తేదీలలో కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో జతపర్చిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్స్, Annexure-I (Revised Attestation Form) గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తీసుకుని రావాలన్నారు.