News February 14, 2025
అర్జీల పరిష్కారానికి జవాబుదారిగా పనిచేయాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో పనిచేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో బద్వేల్, కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
Similar News
News December 17, 2025
కడప జిల్లాలో ‘ఫేస్ వాష్ అండ్ గో’

కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రాత్రి వేళ పలుచోట్ల వాహనాలను నిలిపారు. లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లకు నీరు అందించి ఫేస్ వాష్ చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
News December 17, 2025
కడప: పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య..?

ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. చాగలమర్రి(M) గోట్లూరుకు చెందిన యువకుడు(24) మెకానిక్ పనిచేస్తుంటాడు. నంద్యాల జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిర్ణయించారు. బ్యాంకులో పని ఉందని సోమవారం ఇంట్లో వాళ్లకు చెప్పి యువకుడు బయటకు వచ్చాడు. రాజుపాలెం మండలం వెల్లాల పొలాల్లోకి వచ్చి విషం తాగి చనిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 17, 2025
కడప జిల్లాలో 47,822 రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్

కడప జిల్లాకు 5,73,675 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి. వీటి పంపిణీకి గడువు ముగిసింది. 47,822 కార్డులు మిగిలిపోయాయి. వీటిని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నారు. వీటి కోసం రూ.200 చెల్లించి పోస్ట్ ద్వారా పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జమ్మలమడుగు డివిజన్లో 17,514, కడపలో 14,455, బద్వేల్‌లో 11,112, పులివెందులలో 4,741 రేషన్ కార్డులు మిగిలిపోయాయి.


