News December 29, 2025
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి: ఎస్పీ

ప్రజల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన 22 మంది బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 30, 2025
స్పెర్మ్ డొనేషన్.. ఈ రూల్స్ తెలుసా?

* 3-5 రోజులు శృంగారానికి దూరంగా ఉండాలి.
* 21-45 వయసుతో ఫిజికల్‌గా, మెంటల్‌గా హెల్తీగా ఉండాలి.
* స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ అలవాటు ఉండకూడదు.
* 1ml స్పెర్మ్‌లో 15-20 మిలియన్ల కణాలలో 40% యాక్టివ్ సెల్స్ ఉండాలి.
* HIV, హెపటైటిస్ B, C, సిఫిలిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వ్యాధులు ఉండకూడదు.
* డొనేట్ చేసిన 6నెలల తర్వాత డోనర్‌కు మరోసారి టెస్టులు చేసి నెగటివ్ వస్తేనే స్పెర్మ్ ఉపయోగిస్తారు.
News December 30, 2025
పోక్సో కేసులు 34% వరకు తగ్గుముఖం: సిద్దిపేట సీపీ

2025 పోలీస్ శాఖ వార్షిక నివేదికలో పోక్సో కేసుల్లో 34% తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్స్ కేసులు 589 నుంచి 572కు తగ్గాయన్నారు. 731 ప్రాపర్టీ ఆఫన్స్ కేసుల్లో ఇప్పటి వరకు రూ.1,42,69,301 వర్త్ ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు. 2024తో పోలిస్తే 2025లో మర్డర్ కేసులు 12% తగ్గాయన్నారు. 2024తో పోలిస్తే 2025లో 4% ఎక్కువ సాధారణ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు.
News December 30, 2025
2025లో శాంతి భద్రతలు ప్రశాంతం: సిద్దిపేట సీపీ

2025లో జిల్లా అంతటా శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని వార్షిక నివేదికలో సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు చేసిన ఫిర్యాదులను ఎటువంటి సంకోచం లేకుండా, నేరాలను నిర్లక్ష్యం చేయకుండా FIRలు స్వేచ్ఛగా నమోదు చేశామన్నారు. కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 507 కేసులు నమోదు చేశామన్నారు.


