News March 15, 2025
అర్ధరాత్రి కాజీపేటలో పోలీస్ పహారా

ప్రజల్లో భరోసా కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అదేశాల మేరకు పోలీసులు పహారా నిర్వహించారు. నేరాల నియంత్రణలో ప్రజలకు పోలీసులు ఉన్నారనే అనే ధైర్యాన్ని కలిగించడం కోసం అర్ధరాత్రి తనిఖీలు చేశారు. ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో పాటు, సాయుధ పోలీసులతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ కాజీపేటలో పహారా కాశారు.
Similar News
News February 25, 2026
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో Phd, PG, డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://wii.gov.in/
News February 25, 2026
కెమికల్స్‌తో నెయ్యి కల్తీ చేసి హెరిటేజ్‌పై నిందలా: CBN

AP: కలియుగ దైవం వేంకటేశ్వరుడికి కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘కెమికల్స్‌తో నెయ్యి కల్తీ చేసి 20 కోట్ల లడ్డూలను తయారుచేశారు. వాళ్లు అన్యాయం చేసి ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్‌పై నిందలు మోపుతున్నారు. ఆ రోజు కూడా బాబాయ్‌ని చంపేసి.. మరుసటి రోజు నారాసుర రక్తచరిత్ర అని నా చేతిలో కత్తి పెట్టారు’ అని మార్కాపురం సభలో మండిపడ్డారు.
News February 25, 2026
‘శతరూప’ గురించి మీకు తెలుసా?

బ్రహ్మ మానవ సృష్టి కోసం మనస్సు నుంచి మొదటి స్త్రీ ‘శతరూప’ను సృష్టించారు. శతరూప అంటే ‘వంద రూపాలు గలది’ అని అర్థం. బ్రహ్మ ఆమె సౌందర్యానికి ముగ్ధుడై అన్ని దిశల నుంచి చూడటానికి 5 తలలు పొందారట. అయితే సృష్టి క్రమాన్ని కాపాడటానికి శివుడు బ్రహ్మ ఐదవ తలను వేరుచేశాడు. వీరిద్దరూ నైమిశారణ్యంలో తపస్సు చేసి మానవాళికి జీవం పోశారని పురాణాల వాక్కు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో వీరిద్దరి అరుదైన ఆలయం ఉంది.


