News July 8, 2025
అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

ఉరవకొండ మం. బూదగవి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారు రోడ్డు పక్కన పడటంతో చాలాసేపటి వరకు ఎవరూ గుర్తించలేదు. అటుగా వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఒకరిని 108లో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 8, 2025
ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్

TG: తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు. ‘రైతు శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రమ్మని చెబితే సీఎం ఢిల్లీ వెళ్లారు. ఆయన బదులు మంత్రులు ఎవరైనా వస్తారని భావిస్తున్నా. ఎవరొచ్చినా చర్చకు సిద్ధం. అక్కడే ఎదురుచూస్తాం. సీఎం ఇంకో రోజు టైమ్ ఇచ్చినా చర్చకు వస్తాం’ అని తెలిపారు.
News July 8, 2025
NLG: స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఉమ్మడి జిల్లాకు AICC కార్యదర్శి సంపత్ కుమార్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టాలని అధిష్ఠానం ఆదేశించింది.
News July 8, 2025
చెల్లెలు లాంటి నాపై ప్రసన్న నీచపు వ్యాఖ్యలు: ప్రశాంతి

AP: వరుసకు చెల్లెలు అయ్యే తనపై YCP నేత నల్లపురెడ్డి <<16985283>>ప్రసన్న<<>> కుమార్ రెడ్డి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని TDP MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న ప్రసన్నను కోర్టుకు ఈడుస్తానని ఆమె హెచ్చరించారు. ‘ప్రతీసారి VPRకు డబ్బు ఉందని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు. ఆయనకు లేవా డబ్బులు? ఏమైనా అడుక్కు తింటున్నారా? అనిల్‌కు కూడా జైలు శిక్ష తప్పదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.