News March 12, 2025

అర్ధరాత్రి రామగుండం CP ఆకస్మిక తనిఖీలు

image

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి రైల్వే స్టేషన్, గోదావరిఖని బస్టాండ్, రామగుండం పోలీస్ స్టేషన్, పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. CPగా బాధ్యతలు ఆయన పరిస్థితులు ఎలా ఉంటుందని, పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.

Similar News

News February 23, 2026

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్

image

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 28 కేంద్రాల్లో 12,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాల స్పష్టం చేశారు.

News February 23, 2026

శ్రీరామనవమి ఏర్పాట్లపై రేపు సమీక్ష

image

వచ్చే నెల 27, 28 తేదీల్లో జరిగే శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం, పట్టాభిషేక వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం కానున్నారు. భక్తులకు కల్పించాల్సిన వసతి సౌకర్యాలపై సమగ్ర సమాచారంతో హాజరుకావాలని అధికారులను ఆదేశించారు. వేడుకలను నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

News February 23, 2026

EPFO గుడ్‌న్యూస్.. వారి ఖాతాల్లో నగదు జమ

image

EPFOలో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా యాక్టివ్‌గా లేని ఖాతాల్లోని డబ్బును చందాదారులకు ఇవ్వనుంది. 31.86 లక్షల ఇనాక్టివ్ ఖాతాల్లో ₹10,903 కోట్లున్నాయి. తొలి దశలో ₹1000 లోపు బ్యాలెన్స్ ఉన్న 7L అకౌంట్లలో పైలట్ ప్రాజెక్టుగా ఆ మొత్తాన్ని జమ చేయనుంది. తర్వాత మిగతా ఖాతాల్లో రిఫండ్ చేయనుంది. మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని ఖాతాలను ఇనాక్టివ్‌గా పరిగణిస్తారు.