News April 12, 2025

అర్ధరాత్రి వరకు కొండగట్టులో పర్యటించిన కలెక్టర్

image

హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు దేవస్థానంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అర్ధరాత్రి వరకు కొండగట్టులో ఉండి ఆలయ పరిసరాల్లో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవలను సమీక్షించారు. అత్యవసర పరిస్థితులలో తక్షణ స్పందన కోసం అన్ని విభాగాల యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వసతుల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 7, 2025

విటమిన్స్ లోపం-లక్షణాలు

image

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది. నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు (నయాసిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ బి12) లోపం. చర్మంపై రాషెస్‌, జుట్టు రాలడం ఉంటే బయోటిన్ (విటమిన్ బి7) లోపం. చేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లుంటే బి విటమిన్ల (ఫోలేట్, బి6, బి12)లోపమని అర్థం చేసుకోవాలి. కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లోపమని గుర్తించాలి.

News November 7, 2025

నిర్మల్: కార్డులు సరే.. పథకాలు ఏవి?

image

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా మారింది కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాలో 29,386 కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే రేషన్ కార్డుదారులు బియ్యం పంపిణీ మినహా ఇతర ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు. ప్రజాపాలన వెబ్ సైట్‌లో కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఆప్షన్ లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.

News November 7, 2025

చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

image

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.