News December 11, 2025
అర్ష్‌దీప్ చెత్త బౌలింగ్.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు

సౌతాఫ్రికాపై టీమ్ ఇండియా పేసర్ అర్ష్‌దీప్ చెత్త బౌలింగ్ చేశారు. ఒకే ఓవర్లో ఏకంగా 7 వైడ్లు వేశారు. తొలి బంతికే డికాక్ సిక్స్ కొట్టగా.. అనంతరం 7 బంతుల్లో 6 వైడ్లు వేశారు. తర్వాత 1, 2, 1 రన్స్ ఇచ్చారు. ఆపై మళ్లీ 7వ వైడ్ వేశారు. ఆఖరి బంతికి డికాక్ సింగిల్ తీశారు. ఈ ఓవర్లో ఎక్స్‌ట్రాలతో కలిపి మొత్తం 18 రన్స్ వచ్చాయి. అర్ష్‌దీప్ బౌలింగ్‌కు హెడ్ కోచ్ గంభీర్ కూడా తీవ్ర అసహనానికి గురైనట్లు కనిపించారు.
Similar News
News December 21, 2025
శ్రీసత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP: <
News December 21, 2025
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రకాలు

మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని ‘పర్సిస్టెంట్ బ్యాక్టీరియూరియా’ లేదా ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. కిడ్నీల్లో వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్ అంటారు. ఇది కాస్త సీరియస్ సమస్య అని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ విసర్జనకు వెళ్లాలనిపించడం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
News December 21, 2025
దేవుడున్నాడు అనేందుకు ప్రూఫ్స్..

ప్రకృతిలో మన మేధస్సుకు అందని వింతలు భగవంతుని ఉనికికి నిదర్శనమవుతున్నాయి. యాగంటి, కాణిపాకం, కాశీ, బిక్కవోలు వంటి క్షేత్రాలలో విగ్రహాలు పెరగడం దైవలీలకు నిదర్శనం. ఈ అద్భుతాలు విగ్రహాల పరిమాణం పెరగడమే కాకుండా, మనలో భక్తిని, ధర్మాన్ని పెంచాలని సూచిస్తాయి. శాస్త్ర సాంకేతికతకు అందని ఈ రహస్యాలు దైవశక్తి అనంతమైనదని మనకు తెలియజేస్తున్నాయి. సృష్టిలోని ఈ వింతలు దేవుడు ఉన్నాడని నమ్మే భక్తులకు గొప్ప సంకేతాలు.


