News April 2, 2025
అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తాం: ASF కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం రేషన్ కార్డుదారులకు అందిస్తామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌లతో కలిసి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి సూచనలు చేశారు.
Similar News
News December 14, 2025
టీమ్ఇండియాకు గిల్ అవసరం: డివిలియర్స్

దక్షిణాఫ్రికాతో తొలి రెండు టీ20ల్లో పేలవ ప్రదర్శన చేసిన భారత యంగ్ ప్లేయర్ గిల్‌కు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ మద్దతుగా నిలిచారు. ‘ఒకటి, రెండు మ్యాచుల్లో ఆడకపోతే అతడి స్థానాన్ని వేరే ప్లేయర్‌తో భర్తీ చేయాలనే చర్చ షాక్‌కు గురిచేస్తోంది. కాస్త ఓపిక పట్టండి. భారత అగ్రెసివ్ లైనప్‌లో ఇలాంటి ప్లేయర్ అవసరం. మీరు కోరుకునేలా పెద్ద మ్యాచుల్లో గిల్ తప్పకుండా పరుగులు చేస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News December 14, 2025
ములుగు: రెండో విడత ఎన్నికలు.. కాంగ్రెస్‌లో టెన్షన్

ఆదివారం జరిగే రెండో విడత ఎన్నికలపై అధికార కాంగ్రెస్‌లో టెన్షన్ మొదలైంది. తొలి అంకంలో మెజార్టీ గ్రామాలను కైవసం చేసుకున్నప్పటికీ ఏటూరునాగారం, తాడ్వాయి చేజారడాన్ని ఆపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గంపెడాశలు పెట్టుకున్న మల్లంపల్లి, పత్తిపల్లి, దేవగిరిపట్నం, జాకారం, అబ్బాపురం, జంగాలపల్లి, వెంకటాపూర్, నల్లగుంట, లక్ష్మీదేవిపేటలో ఫలితంపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
News December 14, 2025
ఈనెల 16న కోదాడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక

డిసెంబర్ 25 నుంచి 28 వరకు కరీంనగర్లో నిర్వహించే సీనియర్స్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 16న కోదాడలోని కేఆర్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నామా నరసింహ రావు తెలిపారు. పూర్తి వివరాలకు 9912381165కు సంప్రదించాలన్నారు.


