News September 11, 2025
అర్హులకు చేయూత ఫించన్ లబ్ధి చేకూరేలా చర్యలు: సిరిసిల్ల కలెక్టర్

చేయూత పింఛన్లపై అవగాహన సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్‌లో అధికారులతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం నిర్వహించారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు తదితరులకు ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుందని కలెక్టర్ తెలిపారు. పారదర్శకంగా పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News September 11, 2025
సిరిసిల్ల: టీబీ రహిత గ్రామాల కోసం అవగాహన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఈరోజు అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా వైద్యాధికారి డా.ఎస్.రజిత టీబీ రహిత గ్రామాల కోసం ఆరు సూచీలపై స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీస్, ఎంఎంపీఓలకు మార్గదర్శకాలు ఇచ్చారు. టీబీ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స, ప్రభుత్వ సదుపాయాలపై వివరించారు.
News September 11, 2025
పరవళ్లు తొక్కుతున్న కోట్ పల్లి ప్రాజెక్ట్: SP

కోట్ పల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో చుట్టుపక్కల కాలువలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని SP నారాయణరెడ్డి తెలిపారు. గురువారం ప్రాజెక్టు నిండి పారుతుండడంతో పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
News September 11, 2025
HNK: బీసీ బహిరంగ సభను సక్సెస్ చేయాలి: మంత్రి

కామారెడ్డిలో నిర్వహించబోయే బీసీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించామని, అనంతరం బీసీలకు న్యాయం చేసేందుకు కృషి చేశామని, బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మంత్రి అన్నారు.