News August 29, 2025

అర్హులకు పెన్షన్ అందించాలి: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేయాలని కలెక్టర్ వెంకట మురళి పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక కలెక్టరేట్‌లో వీక్షణ సమావేశం నిర్వహించి అర్హులకు పెన్షన్లు అందించాలన్నారు.

Similar News

News August 29, 2025

NTR: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

image

మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, సోషల్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 9 లోపు విజయవాడ మారుతీనగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ప్రక్రియ, వేతన వివరాల కోసం https://ntr.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

News August 29, 2025

సూపర్ వైజర్ పోస్టులకు దరఖాస్తులు: ప్రభాకర్

image

వయోజన విద్యా శాఖలో ఖాళీగా ఉన్న ఏడు సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వయోజన విద్యాశాఖ అధికారి ప్రభాకర్ తెలిపారు. పది సంవత్సరాల సర్వీసు ఉన్న ఎస్‌జీటీ, పీఈటీ, గ్రేడ్-2 పండిట్ టీచర్లు, 45 ఏళ్లలోపు వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు ఏలూరు వయోజన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ 9న కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయని వివరించారు.

News August 29, 2025

కృష్ణా: మెగా DSC.. 95% అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మెగా DSCలో మెరిట్ సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం జరిగింది. నోబుల్ కళాశాలలో 1,208 పోస్టులకు గాను, తొలిరోజు 1,048 మందికి కాల్ లెటర్లు జారీ చేశారు. 95% మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. 200 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంది. ఆన్‌లైన్‌ అప్‌లోడ్ సమస్యలు, గైర్హాజరైన వారికి శుక్రవారం వెరిఫికేషన్ ఉంటుందని డిప్యూటీ DEO తెలిపారు.