News January 23, 2025
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు: కలెక్టర్

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని 16వ వార్డు సభలో మూడవ రోజు కొనసాగుతోన్న ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. అర్హులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
ఖమ్మం: కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు డుమ్మా.. కారణమిదేనా?

ఖమ్మం జిల్లాలో ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పర్యటనలో పార్టీ కీలక నేతలు పువ్వాడ అజయ్, కందాల, సండ్ర, వద్దిరాజు రవిచంద్ర, తాత మధు ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్‌లో తనకు కేసీఆర్ తప్పా మరో లీడర్ లేరని కవిత చేసిన కామెంట్స్ వల్లే ఆపార్టీ నేతలంతా దూరంగా ఉన్నారనేది టాక్. ఆమె పర్యటనలో జిల్లా నేతలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
News July 6, 2025
చివరికి కల్లు కాంపౌండుకు రమ్మంటారా ఏంటి..?: జగ్గారెడ్డి

‘రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు కేసీఆర్‌ను అసెంబ్లీకి ఆహ్వానిస్తే ప్రెస్ క్లబ్, బోట్స్ క్లబ్‌కు రావాలని.. అక్కడ చర్చిద్దామని కేటీఆర్ అంటున్నాడు. చివరికి కల్లు కాంపౌండుకు రావాలని పిలుస్తారా ఏంటి?’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. CM రేవంత్.. కేసీఆర్‌ను పిలుస్తుంటే సెకెండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని గాంధీభవన్‌లో విమర్శించారు.
News July 6, 2025
సంగారెడ్డి జిల్లాలో మూడు డెంగ్యూ కేసులు

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డిలోని సోమేశ్వర వాడలో ఒకటి, ఇస్నాపూర్లో ఒకటి, రామచంద్రపురం పరిధిలోని వెలిమెల గ్రామంలో ఒకటి నమోదు అయ్యానని పేర్కొన్నారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.