News March 15, 2025
అర్హులైన ప్రతిఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్: రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కోసం పోరాడుతామని TUWJ(IJU) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తెలిపారు.శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల TUWJ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. విరాహత్ అలీ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. డెస్క్ జర్నలిస్టులతో సహా అర్హులైన వారికి అందేలా కృషి చేస్తామన్నారు.
Similar News
News March 17, 2025
విజయవాడ: నకిలీల ఘటనపై స్పందించిన ఏసీపీ

నకిలీ పోలీసులు, నకిలీ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. సోమవారం మాచవరం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు, మీడియా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను ఎవరైనా బెదిరిస్తే నిస్సంకోచంగా పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు.
News March 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: ‘ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించాలి’

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఉపాధి హామీ పథకం కూలీలకు 10 వారాల బకాయిలు చెల్లించాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు వ్యవసాయ కార్మిక సంఘం నేతలు విన్నవించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు.
News March 17, 2025
బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన పొన్నం

TG: బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా బిల్లులను తీసుకొచ్చింది. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.