News August 29, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తాం: కలెక్టర్

image

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్‌లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ పాల్గొన్నారు.

Similar News

News August 29, 2025

యలమంచిలి: గోదావరిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి

image

యలమంచిలి మండలం చించినాడ పుష్కర ఘాట్‌లో స్నానానికి దిగి డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి గ్రామానికి చెందిన వేగి మోహనరావు (42) మృతి చెందినట్లు ఎస్ఐ కే.గుర్రయ్య తెలిపారు. ఈ నెల 25వ తేదీన స్నానానికి దిగిన మెహనరావు ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయాడన్నారు. గురువారం దర్బరేవు వద్ద గోదావరిలో మృతదేహం లభ్యమైందని చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News August 29, 2025

అత్తిలి: దైవ దర్శనానికి వెళ్తుండగా చెట్టు మీద పడి వ్యక్తి మృతి

image

ద్వారకాతిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తున్న ఆ కుటుంబాన్ని దురదృష్టం వెంటాడింది. అత్తిలికి చెందిన వెంకట సుబ్బారావు తన భార్య నాగదుర్గవేణి, కుమారుడితో కలిసి బైక్‌పై చినవెంకన్న దర్శనానికి వెళ్తున్నారు. ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేట సమీపంలో వర్షం ధాటికి ఓ చెట్టు కుప్పకూలి వారిపై పడింది. ఘటనలో సుబ్బారావు మృతి చెందగా భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. SI సుధీర్ కేసు నమోదు చేశారు.

News August 29, 2025

గణేశ్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: ఐజీ

image

గణేశ్ నిమజ్జన వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, పోలీసులు కృషి చేయాలని ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. నరసాపురంలో ఆయన మాట్లాడారు. ఊరేగింపులో కుల, మత, ప్రాంత లేదా రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు లేదా చర్యలు ఉండరాదని సూచించారు. నిమజ్జనం కేవలం భక్తిభావంతో మాత్రమే జరుపుకోవాలని ఆయన కోరారు.