News March 5, 2025

అర్హుల ఎంపికను పూర్తి చేయాలి: హనుమకొండ కలెక్టర్

image

మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకానికి జిల్లాలో ఎంతమంది ఎంపికయ్యారని, ఎన్ని దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయనే, తదితర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 5, 2025

కవిటి : పెళ్లి ఫిక్స్.. యువతి సూసైడ్

image

నిశ్చితార్థమై పెళ్లి జరగాల్సిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కవిటి (M) కపాసుకుద్దిలో మంగళవారం జరిగింది. ఎస్సై వి. రవివర్మ కథనం.. వడ్డిపుట్టుగకు చెందిన సోనియాకు ఇటీవల నిశ్చితార్థమైంది. కాగా ఆమె పెళ్లి మే నెలలో జరగాల్సి ఉంది. అయితే ఆమె మానసిక స్థితి సరిగా లేదని , ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 5, 2025

ADB: మీనాక్షి MEETING.. శ్రేణులు WAITING

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ బుధవారం ఆదిలాబాద్ పార్లమెంటరీ సమావేశాన్ని HYD గాంధీభవన్‌లో నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే ఆమె నివేదిక తెప్పించుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ మీటింగ్‌లో పాల్గొననుండడంతో ఆమె ఏం చెబుతారోనని శ్రేణులు వెయిట్ చేస్తున్నారు. మీ కామెంట్?

News March 5, 2025

‘ఇంకెంత కాలం సాగాలి?’.. తెలంగాణ స్పీకర్‌కు సుప్రీం నోటీసులు

image

TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ MLAల పదవీకాలం ముగిసేంత వరకూ సాగాలా? అని ప్రశ్నించింది. ఇలాగే జరిగితే ప్రజాస్వామ్యం ఏం కావాలని నిలదీసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, EC, ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25కి విచారణ వాయిదా వేసింది.

error: Content is protected !!