News April 8, 2025
అలంపూర్: ‘అభివృద్ధికి నోచుకోని తెలంగాణ టూరిజం హోటల్’

అలంపూర్ పట్టణంలోనీ ప్రధాన కూడలిలో ఉన్న తెలంగాణ టూరిజం హోటల్ ప్రస్తుతం భోజనాలు లేక ఆలయాలకు వచ్చే సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో వసతి రూములతో పాటు క్యాంటీన్ ఉండడంతో భక్తులకు భోజనాలకు ఇబ్బంది ఉండేది కాదు. ఈ హోటల్‌కి వచ్చే సందర్శకులు ఏసీ రూములు మాత్రమే ఉన్నాయి. టూరిజం హోటల్‌ను అభివృద్ధి చేసి క్యాంటీన్, నాన్ ఏసీ రూములను ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుందని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News April 17, 2025
ఎంజీఎంలో దొంగలు ఉన్నారు.. జాగ్రత్త!

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ఆవరణలో మట్టెవాడ పోలీసులు బుధవారం బ్యానర్ కట్టారు. ఈ మేరకు ఆసుపత్రికి వచ్చే వారికి ఈ విషయాన్ని చెబుతున్నారు. ఆసుపత్రిలో గుర్తు తెలియని దొంగలు తిరుగుతున్నారని, వాహనాలు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
News April 17, 2025
KNR: ఊరు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి: సీపీ

వేసవి సెలవుల దృష్ట్యా ఇంటికి తాళం వేసి వెళ్లేవారు, అలాగే బస్సుల్లో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు. ఊరెళ్లేవారు ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్‌లో భద్రపరుచుకోవాలని లేదా సురక్షితంగా తమ వెంట దాచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లే ముందు చుట్టుపక్కల నమ్మకస్తులకు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.
News April 17, 2025
మంచిర్యాల: ఒకరి అరెస్ట్.. ఇద్దరు పరార్

మంచిర్యాల జిల్లాకేంద్రంలోని బాయ్స్ హైస్కూల్ ఏరియాలో గంజాయి కలిగి ఉన్న ముగ్గురిలో ఒకరిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లగా ఇద్దరు పారిపోయారు. మాడవి జీవన్ జాషువాను పట్టుకున్నారు. అతడి నుంచి 1.080కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు పంపించారు.