News November 18, 2024

అలంపూర్ ఆలయాల్లో భక్తుల రద్దీ

image

కార్తీక సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లాలోని సోమశిల, బీచుపల్లి, మల్దకల్, ఉమామహేశ్వరం, అలంపురం, మన్యంకొండ వంటి పలు పుణ్యక్షేత్రాల్లో భక్తులు రద్దీ నెలకొంది. సంబంధిత దేవస్థానాలు ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేసి భక్తులను దర్శనానికి క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్‌లో భక్తులకు మంచినీరు కూడా అందించాలని హిందూ ధార్మిక సేన ప్రతినిధులు దేవాదాయ శాఖ వారిని కోరారు.

Similar News

News November 18, 2024

గ్రూప్-3 పరీక్షలో NRPT-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రశ్న

image

ఈరోజు జరిగిన గ్రూప్-3 పరీక్షల్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓ ప్రశ్నను అడిగారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏది సరైనది కాదు.? అన్న ప్రశ్న వచ్చింది. గ్రూప్-3 పరీక్షలో నారాయణపేట జిల్లా నుంచి ప్రశ్న రావడం పట్ల భారతీయ కిసాన్ సంగ్, పలువురు జలసాధన సమితి సభ్యులు, ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.

News November 18, 2024

కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో స్నేహితులు దుర్మరణం

image

HYD- శ్రీశైలం హైవేపై కడ్తాల్ టోల్ గేట్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కడ్తాల్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు రాజు, మహేశ్ మైసిగండి నుంచి కడ్తాల్ వైపు బైక్ పై వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్నేహితులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర వషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 18, 2024

నేడు లగాచర్లకు జాతీయ ST కమిషన్ మెంబర్

image

కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగాచర్లకు జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10గంటలకు లగాచర్లకు చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడి మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమావేశం అవుతారు. సాం. 4 గంటలకు సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులతో మాట్లాడి హైదరాబాద్ వెళ్తారు.