News August 10, 2025
అలంపూర్ ఆలయ అర్చకులకు నోటీసులు

దేవాదాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన్నందుకు గాను జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల అర్చకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆలయ ఈవో పురేందర్ తెలిపారు. ఈ నెల 6న డోన్‌లో ఒక రాజకీయ నాయకుడి ప్రైవేట్ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారని, ఇది SMలో వైరల్ కావడంతో దేవాదాయశాఖ సీరియస్‌గా స్పందించిందని చెప్పారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అర్చకులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.
Similar News
News August 10, 2025
టాలీవుడ్‌లో స్టైల్ ఐకాన్స్ వారే: సాయిధరమ్ తేజ్

టాలీవుడ్‌లో మోస్ట్ స్టైల్ ఐకాన్ రామ్ చరణ్ అని మెగా హీరో సాయిధరమ్ తేజ్(SDT) చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా మరో స్టైలిష్ యాక్టర్ అని తెలిపారు. నిన్న జరిగిన ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 వేడుకలో మోస్ట్ డిజైరబుల్(మేల్) అవార్డును SDT సొంతం చేసుకున్నారు. అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరెంజ్ మూవీలో RC లుక్స్ తన ఆల్‌టైం ఫేవరెట్ అని పేర్కొన్నారు.
News August 10, 2025
RKP: 24 గంటల్లో చోరీ కేసు ఛేదన

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మావతి కాలనీలో రాజయ్య అనే సింగరేణి కార్మికుడి ఇంట్లో శుక్రవారం రాత్రి జరిగిన చోరీ కేసును 24 గంటల్లో పోలీసులు చేధించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్, రాజశేఖర్, మధుసూదన్, లలిత సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడు జాడి సురేశ్‌ను అరెస్ట్ చేశారు. చోరీ సొత్తు 13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
News August 10, 2025
హోరాహోరీ ఫైట్.. ఇద్దరు బాక్సర్లు మృతి

జపాన్ బాక్సింగ్ ఈవెంట్లో తీవ్ర విషాదం నెలకొంది. టోక్యో కొరాకువెన్ హాల్ పోటీల్లో ఇద్దరు యువ బాక్సర్లు గాయాలపాలై మృతిచెందారు. ఈనెల 2న షిగెటోషీ కొటారీ(28) 12 రౌండ్ల హోరాహోరీ ఫైట్ తర్వాత రింగ్‌లోనే కుప్పకూలిపోయారు. తర్వాతి రోజు మరో మ్యాచ్‌లో హిరోమాసా ఉరకావా(28) ఫైనల్ రౌండ్లో నాకౌట్ అయ్యారు. వీరిద్దరూ బ్రెయిన్ ఇంజూరీస్‌తోనే మరణించడం గమనార్హం. ఈ విషయాన్ని వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇవాళ వెల్లడించింది.