News September 20, 2025

అలంపూర్ ఆలయ అర్చకులకు హైకోర్టు ఊరట

image

జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి చెందిన ముగ్గురు అర్చకుల సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజకీయ నాయకుడి పెళ్లిలో వేద ఆశీర్వచనం చేశారని ఈ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈవో అనుమతితోనే తాము పెళ్లికి వెళ్లామని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది.

Similar News

News September 20, 2025

హనుమకొండ కలెక్టరేట్‌లో లైంగిక వేధింపుల కలకలం..!

image

హనుమకొండ కలెక్టరేట్‌లోని ఓ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిని అదే సెక్షన్‌లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ తన క్యాబిన్‌లోకి పిలిచి అసభ్యకరంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ బాధిత మహిళ కలెక్టర్ స్నేహ శబరీష్‌కు ఫిర్యాదు చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ తక్షణమే బదిలీ చేశారట.

News September 20, 2025

మర్రిపూడిలో భార్యను చంపిన భర్త మృతి

image

మర్రిపూడి మండలం రేగలగడ్డలో ఈ నెల 13న భార్య జయమ్మను రోకలిబండతో భర్త నారాయణ (50) హత్య చేశారు. అనంతరం తానూ గొంతు కోసుకున్న విషయం తెలిసిందే. అయితే అతను అప్పటి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై టి.రమేశ్ బాబు శుక్రవారం తెలిపారు. వారికి 25 ఏళ్ల కిందట వివాహం కాగా అనుమానంతో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో భార్యను చంపినట్లు సమాచారం.

News September 20, 2025

డేంజర్ చికెన్.. నిర్వాహకుడిపై కేసు నమోదు

image

అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో ఉన్న చికెన్ సెంటర్‌లో రోజుల కొద్దీ నిల్వ ఉంచిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. షాప్ నిర్వాహకుడు ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ తస్లీమ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు నివేదించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.