News January 26, 2025

అలంపూర్ : జోగులాంబ అమ్మవారి సేవలో హైకోర్ట్ న్యాయమూర్తి

image

ఐదో శక్తిపీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ఉభయ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు చేత తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచన మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. తదనంతరం ఆలయ క్షేత్రం స్థల పురాణం, చరిత్ర గురించి ఆలయ అర్చకులు వివరించారు.

Similar News

News March 13, 2025

TODAY HEADLINES

image

* తల్లికి వందనం పథకంలో ఎలాంటి నిబంధనలు లేవు: చంద్రబాబు
* ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: రేవంత్
* రేవంత్‌ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి: KTR
* ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేస్తాం: లోకేశ్
* బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణం: పోసాని
* ఈనెల 14న హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్
* అసెంబ్లీ సమావేశాలకు హాజరైన KCR
* భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత
* మారిషస్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ

News March 13, 2025

పుష్ప 2 తొక్కిసలాట: ప్రస్తుతం శ్రీతేజ్ ఎలా ఉన్నాడంటే..

image

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప2 రిలీజ్ రోజు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకుంటున్నాడు. కానీ నాడీ వ్యవస్థ దెబ్బతిని మాటలు అర్థం చేసుకోలేక, కుటుంబీకులను గుర్తించలేకపోతున్నాడు. స్పర్శ కూడా తెలియడం లేదని డాక్టర్లు చెప్పారని BBC కథనంలో పేర్కొంది. నేరుగా పొట్టలోకి ట్యూబ్ అమర్చే ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్ట్రోమీ ప్రక్రియతో ఆస్పత్రి సిబ్బంది ఆహారం పంపిస్తున్నారు.

News March 13, 2025

HMDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 3వేల చ.కి.మీ భూభాగం చేర్చుతున్నట్లు పేర్కొంది. దీంతో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండలోని 16 మండలాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం HMDA పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి.

error: Content is protected !!