News October 9, 2025
అలంపూర్: తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు గురువారం తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాల ద్వారా మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించారు. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో సుమారు 2 గంటల పాటు ఈ శిక్షణ జరిగింది. స్పెషల్ బోట్ల సహాయంతో వరద నీటిలో ప్రాణాలను ఎలా కాపాడాలో రెస్క్యూ టీమ్‌లు కళ్లకు కట్టినట్టు చూపించారు. విపత్తులు ఎదురైనప్పుడు స్వయంగా రక్షించుకోవాలన్నారు.
Similar News
News October 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 10, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు
✒ ఇష: రాత్రి 7.10 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 10, 2025
CM పర్యటనకు 1250 మందితో బందోబస్త్: SP

1,250 మంది పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు ఎస్పీ అజిత తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. అధికారులకు బ్రీఫింగ్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ సమస్య లేకుండా, పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు ఏర్పాటు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
News October 10, 2025
తిరుపతి: PG ఫలితాలు వచ్చేశాయ్.!

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది డిసెంబర్‌లో (పీజీ) PG M.A హిస్టరీ, M.Sc బాటని/బయో కెమిస్ట్రీ/ జియాలజీ/ జువాలజీ/ బయోటెక్నాలజీ/ అంత్రపాలజీ మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.