News April 1, 2025
అలంపూర్: ‘నిర్లక్ష్యానికి నిదర్శనం ప్రభుత్వ వైద్యశాల’

అలంపూర్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో కనీస రోగులకు అందించే మందులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. అలంపూర్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన పలువురు కుక్క కాటుకు గురయ్యారు. ఈ క్రమంలో వైద్యశాలకు వెళితే కుక్కకాటుకు మందు వైద్యశాలలో లేదని పక్క రాష్ట్రమైన కర్నూల్‌కి వెళ్లాలని వైద్యులు సూచించారని రోగులు ఆరోపిస్తున్నారు. కనీసం మందులు లేకుంటే ఎట్లా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు?
Similar News
News April 2, 2025
కరీంనగర్: కలెక్టరేట్లో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
News April 2, 2025
యూపీఏ హయాంలోనూ సవరణలు జరిగాయి: రిజిజు

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. అందులో ప్రతిపాదించిన సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. చట్టంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించొద్దన్నారు. యూపీఏ హయాంలోనూ ఈ చట్టంలో సవరణలు జరిగాయన్నారు. అది మిగతా చట్టాలపై ప్రభావం చూపిందని, అందుకే మళ్లీ సవరించాల్సి వస్తోందన్నారు.
News April 2, 2025
NZలో వరుసగా 12 వన్డేల్లో ఓడిన పాక్

పాక్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో పాక్ ఘోరంగా ఓడిపోయింది. న్యూజిలాండ్‌లో జరిగిన చివరి 12 వన్డేల్లో పాక్ మట్టికరిచింది. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన NZ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు T20 సిరీస్‌ను 4-1తో గెలిచింది. స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకున్నా కివీస్ అదరగొట్టింది. NZ-B టీమ్ ముందు కూడా పాక్ చతికిలపడిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.