News April 16, 2025
‘అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలి’

అలంపూర్ నియోజకవర్గంలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించి అన్ని రకాల వైద్య పరికరాలు, మందులు ఏర్పాటుచేసి వెంటనే అందుబాటులో తేవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి . వెంకటస్వామి డిమాండ్ చేశారు. CPM ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు GK.ఈదన్న, A.పరంజ్యోతి, రమేశ్, ఉండవెల్లి మండల నాయకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Similar News
News January 9, 2026
SBIలో 1,146 జాబ్స్.. ఒక్కరోజే ఛాన్స్

SBIలో 1,146 ఉద్యోగాలకు(కాంట్రాక్ట్) దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో VP వెల్త్(SRM) 582, AVP వెల్త్(RM) 237, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. పోస్టును బట్టి 20-42ఏళ్ల వయసు ఉండాలి. జీతం VP వెల్త్‌కి ₹44.70L, AVP వెల్త్‌కి ₹30.20L, CREకి ₹6.20L వార్షిక జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://sbi.bank.in/
News January 9, 2026
కామారెడ్డి: రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి ఈనెల 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా DIEO షేక్ సలాం తెలిపారు. తిరిగి 19న కళాశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సెలవు దినాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా ప్రైవేటు విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 9, 2026
జుట్టుకు రంగేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

తెల్లజుట్టును దాయడానికే కాకుండా ఫ్యాషన్ కోసం కూడా జుట్టుకు రంగువేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముందు జుట్టు ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రఫ్, డ్రైగా ఉన్న జుట్టుకు రంగువేసినా సరిగ్గా అంటదు. ఎవరో చేశారని కాకుండా మీకు ఏ రంగు నప్పుతుందో చూసుకొని అదే వేసుకోవాలి. కలర్ వేసే ముందు హెయిర్‌లైన్ చుట్టూ వాజిలైన్ రాయాలి. చేతులకు గ్లోవ్స్ ధరించాలి.


