News March 20, 2025
అలంపూర్: శ్రీ జోగులాంబ అమ్మవారి సేవలో నిరంజన్ రెడ్డి

ఐదో శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను ఈరోజు సాయంత్రం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉభయ ఆలయాలను దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల ద్వారా తీర్థప్రసాదం అందించి, ఆశీర్వచనం మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. తదనంతరం తుంగభద్ర నది, నవబ్రహ్మ ఆలయాలను దర్శించుకున్నారు. ఆయన వెంట దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ శేఖర్ ఆచారి ఉన్నారు.
Similar News
News March 21, 2025
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు మూవీ యూనిట్ పేర్కొంది. సాటిలేని హీరోయిజం ప్రయాణం వెండి తెరకు మరింత చేరువైనట్లు పేర్కొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా మిగతా భాగాన్ని తెరకెక్కించే బాధ్యత జ్యోతి కృష్ణ తీసుకున్నారు. కాగా ఈ మూవీ మే 9న థియేటర్లలో విడుదల కానుంది.
News March 21, 2025
పరీక్షా కేంద్రాలను సందర్శించిన DEO

జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలను సందర్శించారు. అనంతరం విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరీక్ష కేంద్రాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
News March 21, 2025
GWL: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

గద్వాల పట్టణంలోని MALD ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో జాబ్ మేళాకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. జాబ్ మేళాలో ఉద్యోగం సంపాదించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు.