News December 19, 2025

అలాంటి ఒప్పందమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం: సిద్దరామయ్య

image

పవర్ షేరింగ్‌పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే CMగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు. ‘నేను ఇప్పుడు సీఎంను. హైకమాండ్ డిసైడ్ చేసే వరకు కొనసాగుతా. అధిష్ఠానం నాకే ఫేవర్‌గా ఉంది. 2.5 ఏళ్ల ఒప్పందమేదీ జరగలేదు’ అని తెలిపారు. CM పదవిపై DK శివకుమార్, సిద్దరామయ్య మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ <<18446337>>బ్రేక్‌ఫాస్ట్<<>> మీటింగ్స్ నిర్వహించారు.

Similar News

News December 19, 2025

సైబర్ నేరాల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ శబరీష్

image

సైబర్ నేరాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని పోలీసు శాఖ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరిష్ ఆన్లైన్ మోసాలను సూచించే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్లో అపరిచితులతో పరిచయాలను దూరంగా ఉండాలని, డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ చేసి పోలీసులంటే నమ్మొద్దని, సైబర్ మోసమని గుర్తించి వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

News December 19, 2025

పిల్లలకు న్యుమోనియా ఉందా?

image

శీతాకాలంలో పిల్లలు న్యుమోనియా ప్రమాదం ఎక్కువ. అధిక జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఆక్సిజన్ తగ్గితే చర్మం, పెదవులు నీలం రంగులోకి మారతాయి. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకం కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి. న్యుమోనియా ఉన్న పిల్లల గదిని శుభ్రంగా, వెచ్చగా ఉంచడం, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు, సూప్ ఇవ్వాలని సూచిస్తున్నారు.

News December 19, 2025

శుభాలను కలిగించే విష్ణు నామస్మరణ

image

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం‍గతిః |
అనిరుద్ధస్సురానందో గోవిందో గోవిదాం‍పతిః ||
శార్జ్ఞమనే విల్లును ధరించిన వీరుడు, భూమండలాన్ని భరించే ప్రభువు, లక్ష్మీదేవి నివసించే హృదయం కలవాడు, సజ్జనులకు పరమగమ్యం ఆయినవాడు, దేవతలకు ఆనందం పంచువాడు, గోవులను, భూమిని కాపాడేవాడు, వేద జ్ఞానము తెలిసిన వారికి ఆశ్రయమిచ్చేవాడు, అజేయుడు.. ఆయనే మహా విష్ణువు. ఆయన నామస్మరణ సర్వశుభాలను కలిగిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>