News December 11, 2025
‘అలాంటి వరి రకాల సాగును ప్రోత్సహించాలి’

ప్రజలు ఎక్కువగా ఆహారంగా తీసుకునే వరి రకాల సాగును ప్రోత్సహించడంతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయంగా ఎగుమతికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఉల్లి కొనుగోలు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. సుబాబుల్ రైతులకు మంచి ధర దక్కేలా చూడాలన్నారు. అరటి, నిమ్మ, ఇతర ఉద్యానపంటల కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు.
Similar News
News December 23, 2025
215 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్(<
News December 23, 2025
ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఇదే: పేటీఎం CEO

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటనే ప్రశ్నకు పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘మర్చంట్ పేమెంట్ QR కోడ్’ ఇండియా తర్వాతే ప్రపంచమంతా ప్రారంభమైందని చెప్పారు. చైనాలోనూ కన్జూమర్ QR కోడ్ మాత్రమే ఉండేదని.. మన దగ్గర వ్యాపారులే ఈ టెక్నాలజీ వాడి విప్లవం తెచ్చారన్నారు. చిల్లర కష్టాలు తీర్చిన ఈ వ్యవస్థ భారత్ గర్వించదగ్గ ఇన్నోవేషన్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
News December 23, 2025
జామఆకులతో మొటిమలకు చెక్

సీజనల్‌గా దొరికే జామకాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికి తెలిసిందే. కానీ.. జామకాయలే కాదు వాటి ఆకులూ మనకి మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జామ ఆకులను పేస్ట్ చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. జామలోని విటమిన్-సి మొటిమలకు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను తగ్గిస్తాయి.


