News January 27, 2025
అలాంటి వారి సమాచారం ఇవ్వండి: ఏసీపీ

విజయవాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని ఏసీపీ దామోదర్ పిలుపునిచ్చారు. ఎవరైనా తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి తీసుకున్నా, విక్రయించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నేరాలు నియంత్రణలో ప్రజలు భాగస్వాములైనప్పుడే నేరాలను అరికట్టవచ్చని సూచించారు. బ్లేడు గంజాయి బ్యాచ్‌పై ఉక్కు పాదం మోపుతున్నామని, వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఏసీపీ తెలిపారు.
Similar News
News September 18, 2025
మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలి: డీఈవో

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేలా ఎంఈవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. భోజనాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలోగా విద్యార్థుల హాజరును మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.
News September 18, 2025
కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.
News September 18, 2025
OFFICIAL: ‘కల్కి-2’ నుంచి దీపికా పదుకొణె ఔట్

రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె రాబోయే సీక్వెల్‌లో నటించబోరని మేకర్స్ ప్రకటించారు. ‘కల్కి-2లో దీపిక భాగం కాదని ప్రకటిస్తున్నాం. అన్నివిధాలుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కిలాంటి సినిమాలో నటించే నటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం. దీపిక తదుపరి సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.