News March 9, 2026
అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

చైల్డ్ పోర్నోగ్రఫీపై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేయకపోయినప్పటికీ మొబైల్‌లో స్టోరేజీలో ఉన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B, పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 15 ప్రకారం నేరమేనని తేల్చిచెప్పింది. అవి కలిగి ఉండటం శిక్షార్హమని తెలిపింది. అశ్లీల వీడియోలను ఫోన్‌లో సేవ్ చేసుకున్న వ్యక్తి తనపై నమోదైన కేసులను కొట్టేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Similar News
News April 15, 2026
GK: తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరు?

☛ కంప్యూటర్ పితామహుడు-చార్లెస్ బాబేజ్
☛ ఆధునిక కంప్యూటర్ పితామహుడు-అలాన్ ట్యూరింగ్
☛ మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్-అడా లవ్‌లేస్ (ఫొటోలో)
☛ మొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్-ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ (ENIAC)
☛ కంప్యూటర్ మెదడు అని దేనిని పిలుస్తారు-CPU (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్)
☛ 1024 MB: 1 GB (గిగాబైట్)
☛ 1024 GB: 1 TB (టెరాబైట్)
News April 15, 2026
నా శరీరంలో ఇప్పటికీ శకలాలు ఉన్నాయి: సంగక్కర

2009 పాక్ పర్యటనలో తమ బస్సుపై జరిగిన ఉగ్రదాడి గురించి శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. ‘మేం గ్రౌండ్‌కు బయల్దేరాం. బాంబు పేలి ఇంటికి తిరిగి వెళ్లిపోతే బాగుండని ఓ బౌలర్ అన్నాడు. నిమిషం కూడా గడవకముందే మాపై దాడి జరిగింది. నా శరీరంలో ఇప్పటికీ శకలాలు ఉన్నాయి’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సంగక్కర, మెండిస్, సమరవీర, తరంగ, లక్మల్, తుషార గాయపడ్డారు.
News April 15, 2026
ఏఐకి శిక్షణ ఇచ్చే ఉద్యోగాలు.. గంటకు ₹14 వేలు!

Aiతో ఉద్యోగాలు పోతాయని అందరూ భయపడుతున్నారు. కానీ ఏఐకే శిక్షణ ఇచ్చే ఉద్యోగాలున్నాయి. ఈ రంగంలోకి అడుగుపెడుతున్న లింక్డ్ ఇన్ ‘ఏఐ లేబర్ మార్కెట్ ప్లేస్’ను టెస్ట్ చేస్తోంది. Ai ట్రైనర్లకు స్కిల్‌ను బట్టి గంటకు ₹3,700-14,000 ఇవ్వనున్నట్లు లిస్టింగ్స్‌లో పేర్కొంది. ఇందులో భాగంగా ఆయా రంగాల నిపుణులు ఏఐ టూల్స్ సామర్థ్యాలను పరీక్షించడం, స్పందనలకు రేటింగ్ ఇవ్వడం, లోపాలను గుర్తించడం వంటివి చేస్తారు.


