News January 7, 2026
అలారం పెట్టుకునే అలవాటు ఉందా?

అలారం శబ్దంతో నిద్ర లేవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మెదడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా అలారం సౌండ్ రావడం వల్ల బీపీ పెరిగే ఛాన్స్ ఉందని, గుండె సంబంధ వ్యాధులూ వస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. మాటిమాటికి స్నూజ్ నొక్కడం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతిని రోజంతా అలసటగా అనిపిస్తుందని తెలిపారు. సహజంగా ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News January 11, 2026
నేడు, రేపు వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం శనివారం వాయుగుండంగా బలహీనపడి శ్రీలంకలోని జాఫ్నా, ట్రింకోమలై వద్ద తీరం దాటింది. ఆ ప్రభావం రాష్ట్రంపై కన్పిస్తోంది. ఫలితంగా ఇవాళ, రేపు TPT, చిత్తూరు, KDP, ATP, అన్నమయ్య, NDL, శ్రీసత్యసాయి, NLR, ప్రకాశం, BPT, GNT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అటు ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది.
News January 11, 2026
వ్యాధుల నుంచి విముక్తి కోసం ‘ఆదివార వ్రతం’

ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుని అనుగ్రహం కోసం ప్రతి నెలలో కనీసం ఒక ఆదివారమైనా ఆయనను భక్తితో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఆదివార వ్రతం ఆచరిస్తే ఆయురారోగ్యాలు సిద్ధించడమే కాకుండా చర్మ, నేత్ర సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. సకల వ్యాధుల విముక్తి కోసం ఈ ఆదివార వ్రతం ఉత్తమ పరిహారంగా పరిగణిస్తారు. ఈ వ్రతాన్ని భక్తితో ఎలా ఆచరించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>లోకి వెళ్లండి.
News January 11, 2026
గేదె పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

ఆవు పాలకంటే గేదె పాలలో ఎక్కువ కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. ఈ పాలు చాలా చిక్కగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. గేదె పాలలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండి ఎముకలను బలోపేతం చేస్తాయి. పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ వల్ల ఆవు పాల కంటే ఇవి ఎక్కువ సమయం నిల్వ ఉంటాయి. మంచి శరీర సౌష్టవం, బరువు పెరగాలనుకువేవారికి గేదె పాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.


