News February 25, 2025
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీలపై కేసులు: విశాఖ జేసీ

గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌లు MRP కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం గ్యాస్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేస్తామని విశాఖ జేసీ మయూర్ అశోక్ హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లతో సోమవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. దీపం-2 పథకం కింద సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోపు లబ్దిదారుల ఖాతాలో సబ్సిడీ జమ కావాలన్నారు. కాని పక్షంలో డీలర్లను సంప్రదించారని లబ్ధిదారులను కోరారు.
Similar News
News February 25, 2025
విశాఖ జిల్లాలో 170 మంది బాలలకు విముక్తి

విశాఖ జిల్లా పరిధిలో బాలకార్మికుల విముక్తికి కార్మిక శాఖ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు ఉప కార్మికశాఖ కమిషనర్ సునీత.. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌కు వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్మిక శాఖపై సోమవారం సమీక్ష జరిపారు. ఈ ఆపరేషన్ ద్వారా 170 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించినట్లు తెలిపారు. విశాఖలో బాల కార్మిక వ్యవస్థ నివారించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.
News February 25, 2025
విశాఖ: మాతృ మరణాలపై సమీక్ష

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో DMHO జగదీశ్వర రావు సోమవారం మాతృ మరణాలపై డిస్ట్రిక్ట్ లెవెల్ ఎం.సి.హెచ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరిలో రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి రెడ్డిపల్లిలోని ఒక మాతృ మరణం జరిగిందన్నారు.ఇకపై మాతృ మరణాలు జరగకుండా చూడాలని హెచ్చరించారు. గర్భిణీగా ఉన్నప్పుడే హై రిస్క్ ప్రెగ్నెన్సి గుర్తించి తగిన సలహాలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
News February 25, 2025
సమన్వయకర్తలుగా పంచకర్ల, వంశీకృష్ణ యాదవ్

మార్చి 14వ తేదిన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు విశాఖ పార్లమెంట్‌కు సంబందించి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్‌ను నియమించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ ను అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. వీరు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వేడుకలు విజయవంతానికి కృషి చేయాలి.