News July 21, 2024
అలా జరిగితే ఉప ఎన్నికలు: మంత్రి తుమ్మల

ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. వారు ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రయోజనం ఉండదని చెప్పారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తిస్తే మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.
Similar News
News March 13, 2025
ఖమ్మం: విషాదం.. BRS నాయకుడి కుమార్తె మృతి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న BRS నాయకుడు చేరుకుపల్లి భిక్షం రెండో కుమార్తె చేరుకుపల్లి శిరీష(23) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఈరోజు మృతిచెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రులయ్యారు. గ్రామస్థులు ఆమె అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 13, 2025
ఖమ్మం: ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంల బదిలీ

టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ డిప్యూటీ ఆర్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న జి.ఎన్.పవిత్ర, భవానీ ప్రసాద్‌ను బదిలీ చేస్తూ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భవానీ ప్రసాద్‌ను మహబూబ్‌నగర్‌కు, జీ.ఎన్.పవిత్రను షాద్‌నగర్‌కు బదిలీ చేశారు. కాగా, వీరి స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
News March 13, 2025
భద్రాచలం: ఆన్లైన్లో టికెట్లు బుకింగ్

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే కళ్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 20వ తేదీ ఉదయం 11 నుంచి ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు తానీషా కళ్యాణ మండపంలో టికెట్లు పొందాలని సూచించారు.