News October 19, 2024
అలా తీసుకెళ్లే ఇసుక పూర్తిగా ఉచితం: మంత్రి కొల్లు

రాష్ట్రంలో ఎడ్లబండి, ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లే ఇసుక పూర్తిగా ఉచితం అని మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ట్వీట్ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సామాన్యులు తమ స్వంత అవసరం మేరకు ఎడ్లబండి లేదా ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లే ఇసుకకు ఎలాంటి ఛార్జీలు ఉండవన్నారు. ఈ నిబంధనతో ఇసుక రవాణా ఖర్చు నుంచి ఉపశమనం లభిస్తుందని కొల్లు ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
Similar News
News July 7, 2025
మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఈనెల 10న నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు.
News July 7, 2025
మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు

మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీవో స్వాతి, తదితరులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News July 7, 2025
నేడు ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు కలెక్టర్

ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఈనెల 10న వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో పెట్టుకొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ట్రస్టును సందర్శించనున్నారు.