News February 14, 2025
అలిపిరి నడక మార్గంలో చిరుత కదలికలు

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. 7వ మలుపు వద్ద నడకదారి భక్తులకు చిరుత కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. భక్తుల నుంచి సమాచారం అందుకున్న విజిలెన్స్ అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. చిరుత కదలికల పట్ల భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. దీంతో భద్రత నడుమ భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.
Similar News
News December 13, 2025
చిత్తూరు: ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ ఫెస్ట్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ వెల్లడించారు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు, అనంతరం 20న జిల్లాస్థాయి కెరీర్ ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ రంగాలు, విభాగాల్లో ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.
News December 13, 2025
చిత్తూరు: ALERT.. ఈ నెల 19 లాస్ట్.!

ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 19వ తేదీలోపు ఆన్ లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. టెన్త్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్స్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు.
News December 13, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు

చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి ఎరువులు, యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 2నెలల కాలంలో జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్టు చెప్పారు. రాబోయే 21 రోజులకు 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. 2,117 టన్నులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


