News February 6, 2026
అలిపిరి: 2నంబర్ ప్లేట్లతో ప్రయాణం

అలిపిరి టోల్‌గేట్ వద్ద రవాణా శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. 18 సీటింగ్ కెపాసిటీ వాహనాల్లో సీట్లు తొలగించి తిరుమలకు భక్తులను తీసుకెళ్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. TTD నిబంధనల ప్రకారం 13సీట్లకు మించి అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే ట్యాక్స్ చెల్లించని రెండు టెంపో వాహనాలపై కేసులు నమోదు చేశారు. రెండు నంబర్ ప్లేట్‌తో నడుస్తున్న జీపును గుర్తించి సీజ్ చేశారు.
Similar News
News February 7, 2026
ఇంట్లో నుంచే LPG కనెక్షన్‌కి ఆధార్ లింక్..!

LPG & ఉజ్వల గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆధార్ e-KYCని పూర్తి చేయాలని కేంద్ర సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే 75% మంది ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపింది. మిగిలినవారు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫ్రీగా KYC చేసుకోవచ్చు. ఈ <
News February 7, 2026
బ్యాలెట్ బాక్సులకు పటిష్ట భద్రత: ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల నిల్వ కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ యార్డు వద్ద వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సమీక్షించారు.
News February 7, 2026
అప్పికట్లలో ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ను తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరవేయడం, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చేపట్టిన ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. బాపట్ల మండలం అప్పికట్లలో పర్యటించిన ఆయన.. సర్వే నమోదు ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. వివరాల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని, ప్రజలకు సేవలందించడంలో జాప్యం చేయకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


