News February 15, 2026
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 పోస్టులకు నోటిఫికేషన్

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 27 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 19వరకు పంపాలి. పోస్టును బట్టి PG, PG(ఫిజికల్ ఎడ్యుకేషన్) MLSc, PhD, NET/SET/SLET, CA/CS/ICWA, BEd , MEd, మెడికల్ పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://careers.amuonline.ac.in/
Similar News
News February 17, 2026
బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.
News February 17, 2026
వేరుశనగలో తెగుళ్ల కట్టడికి మరికొన్ని సూచనలు

వేరుశనగలో పంట చుట్టూ లేదా పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కంచె పంటగా సజ్జ లేదా జొన్నలను 3-4 వరుసలలో వేసుకోవాలి. వేరుశనగ పంటలో పసుపు, నీలం జిరుగు అట్టలను ఎకరాకు 10 నుంచి 15 చొప్పున పొలంలో అమర్చుకోవాలి. వేరుశనగ పంటలు ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200 కిలోల జిప్సం ఎరువును వేసుకోవాలి. ఈ జాగ్రత్తలతో ఆకుమచ్చ తెగులుతో పాటు ఇతర చీడపీడల ఉద్ధృతిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News February 17, 2026
ఎవరికో ఆ 11 మున్సిపాలిటీలు?

TG: నిన్న వాయిదాపడ్డ 11 మున్సిపాలిటీల పాలకవర్గ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. తొర్రూర్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, ఇల్లందు, సుల్తానాబాద్‌లో ఛైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్, BRS విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే వీటికి ప్రత్యేకంగా అబ్జర్వర్లను నియమించాయి. ఈ 11 మున్సిపాలిటీలు ఎవరి ఖాతాలో పడతాయో సాయంత్రానికి తేలిపోనుంది.


