News February 1, 2026

అల్కరాజ్ అద్భుతం.. హిస్టరీ క్రియేట్ చేసిన యంగ్ స్టార్!

image

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ హిస్టారిక్ విక్టరీ సాధించారు. 10 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జకోవిచ్‌ను 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో ఓడించి తన కెరీర్‌లో తొలి ఆస్ట్రేలియన్ టైటిల్‌ను ముద్దాడారు. తొలి సెట్ ఓడిపోయినా పట్టుదలగా పుంజుకుని జకోవిచ్‌ను మట్టికరిపించారు. ఈ గెలుపుతో కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా అల్కరాజ్ రికార్డు సృష్టించారు.

Similar News

News February 11, 2026

మరో కేసులో అంబటి రాంబాబుకు బెయిల్

image

AP: వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో బెయిల్ రాగా, తాజాగా మెడికల్ కాలేజీల PPP విధానంపై ఆందోళనల కేసులో బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.

News February 11, 2026

ఆయిల్ పామ్: నత్రజని లోపం ఇలా గుర్తించండి

image

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.

News February 11, 2026

హంసలదీవి వేణుగోపాలస్వామి క్షేత్రం

image

కృష్ణాజిల్లా హంసలదీవిలోని వేణుగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనది. పుట్టలో ఉన్న స్వామికి ఆవులు పాలు కార్చడం చూసి, గోపాలురు నిప్పు పెట్టగా స్వామి విగ్రహం భిన్నమైందని జనశృతి. ఆ విగ్రహం పక్కనే కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి, సాగర సంగమంలో స్నానమాచరిస్తే సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఆలయం 1977 ఉప్పెన వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి వేలాది మందిని కాపాడింది.