News July 19, 2024

అల్పపీడనం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయం పూరీ సమీపంలో తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ, భీమిలి పోర్టుల్లో మూడో నంబర్, మచిలీపట్నం, నిజాంపట్నంలో మొదటి నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

Similar News

News January 23, 2025

భారీగా పెరిగిన ధరలు.. కేజీ రూ.450

image

AP: నాన్‌వెజ్ వంటలు ఘాటుగా ఉండాలంటే వెల్లుల్లి ఉండాల్సిందే. అయితే ధర మాత్రం అందుబాటులో లేదు. తాడేపల్లిగూడెం మార్కెట్‌లో KG ధర ₹450కి చేరింది. పదేళ్ల తర్వాత ఈ స్థాయిలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఇందోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా ప్రాంతాల్లో సాగు తగ్గడమే ధర పెరగడానికి కారణమంటున్నారు. గూడెం నుంచే గోదావరి, విశాఖ, VZM, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు వెల్లుల్లి ఎగుమతి అవుతుంటుంది.

News January 23, 2025

అనిల్ రావిపూడి @100% స్ట్రైక్ రేట్‌

image

డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నట్లు SVC ట్వీట్ చేసింది. ‘దశాబ్దకాలంగా బ్లాక్ బస్టర్స్ అందిస్తూ, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోన్న హిట్ మెషీన్ అనిల్‌కు అభినందనలు. డబుల్ హ్యాట్రిక్ సాధించడంలో మీతో భాగమైనందుకు గర్విస్తున్నాం’ అని తెలిపింది. అనిల్ తన కెరీర్‌లో పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీశారు.

News January 23, 2025

మెట్రోలో ఇన్ని వస్తువులు మర్చిపోయారా?

image

అసాంఘిక కార్యకలాపాలతో వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రో రైలులో గతేడాది కోట్ల రూపాయల వస్తువులను విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. రైలులో & స్టేషన్ ఏరియాలోని ఎక్స్ రే లగేజీ స్కానర్ వద్ద మర్చిపోయిన వాటిల్లో రూ.40 లక్షలకు పైగా నగదు, 89 ల్యాప్‌టాప్స్, 193 మొబైల్స్‌తో పాటు 9 మంగళసూత్రాలు, వెండి ఆభరణాలు, ఉంగరాలున్నాయి. అయితే, CISF సిబ్బంది ద్వారా వీటి యజమానులను గుర్తించినట్లు వెల్లడించారు.